యువ నటుడు ఆత్మహత్య | Tamil Actor Srivatsav Chandrasekar Reportedly Commits Suicide | Sakshi
Sakshi News home page

యువ నటుడు ఆత్మహత్య!

Published Sat, Feb 6 2021 6:41 PM | Last Updated on Sat, Feb 6 2021 7:07 PM

Tamil Actor Srivatsav Chandrasekar Reportedly Commits Suicide - Sakshi

చెన్నై: యువ నటుడు, మోడల్‌ శ్రీవాస్తవ్‌ చంద్రశేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న అతడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  డిప్రెషన్‌తో బాధపడుతున్న గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, షూటింగ్‌ ఉందని చెప్పి పెరంబూర్‌లోని ఇంటి నుంచి, తన తండ్రి ఆఫీస్‌ హౌజ్‌కు చేరుకున్న శ్రీవాస్తవ్‌ అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.(చదవండి: అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు ప్రమాదం)

కాగా శ్రీవాస్తవ్‌ మరణం పట్ల సహచర నటీనటులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎన్నై నోకి పాయుమ్‌ తొట్టా’ సినిమాలో హీరో ధనుష్‌తో శ్రీవాస్తవ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. అదే విధంగా .. ‘వల్లామై తరాయో’ అనే వెబ్‌సిరీస్‌లో సైతం నటించాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌ ఓ చినదాన అనే టైటిల్‌తో ఓ తెలుగు చానెల్‌లో ప్రసారం అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement