Srivatsava
-
ఆర్బీకేల పనితీరు బాగుంది
భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్ శాఖల సహాయకులు జాబ్‌చార్ట్‌తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువతులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది. కియోస్క్ పనితీరుపై ఆరా.. ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు. రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్ పాము సునీతామాన్‌సింగ్‌ను కియోస్క్ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్ వివరించారు. దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్ఆర్ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీవీసీగా ప్రవీణ్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారని, కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారని తెలిపింది. సీవీసీ సురేశ్ ఎన్ పటేల్ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయింది. అప్పటి నుంచి శ్రీవాస్తవ తాత్కాలిక సీవీసీగా కొనసాగుతున్నారు. సీవీసీగా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు. 1988 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన శ్రీవాస్తవ అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన వారు. గత ఏడాది జనవరి 31న కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. సీవీసీ సారథ్యంలో విజిలెన్స్ కమిషన్‌లో గరిష్టంగా ఇద్దరు కమిషనర్లు ఉండొచ్చు. ఐబీ మాజీ చీఫ్ అర్వింద్ ఒక్కరే ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్నారు. మరో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. -
యువ నటుడు ఆత్మహత్య
చెన్నై: యువ నటుడు, మోడల్ శ్రీవాస్తవ్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న అతడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, షూటింగ్ ఉందని చెప్పి పెరంబూర్‌లోని ఇంటి నుంచి, తన తండ్రి ఆఫీస్ హౌజ్‌కు చేరుకున్న శ్రీవాస్తవ్ అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.(చదవండి: అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం) కాగా శ్రీవాస్తవ్ మరణం పట్ల సహచర నటీనటులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్టా’ సినిమాలో హీరో ధనుష్‌తో శ్రీవాస్తవ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అదే విధంగా .. ‘వల్లామై తరాయో’ అనే వెబ్‌సిరీస్‌లో సైతం నటించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓ చినదాన అనే టైటిల్‌తో ఓ తెలుగు చానెల్లో ప్రసారం అవుతోంది. -
విభజన జరిగితే బోర్డు చూసుకుంటుంది: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే రైల్వే వ్యవహారాన్ని బోర్డు చూసుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ చెప్పారు. బోర్డు అడిగినప్పుడు తగిన సమాచారాన్ని ఇస్తామన్నారు. ఉద్యమాల వల్ల రైల్వేకు ఎటువంటి నష్టం సంభవించలేదని చెప్పారు. ప్రయాణికులు రద్దీగా ఉన్న మార్గంలో అదనపు బోగీలను కేటాయిస్తామన్నారు. ఎంఎంటీస్ రెండో విడత పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ముంబై రైళ్ల సమాచారం మొబైల్‌లోకి అందుబాటులోకి తెస్తామన్నారు. రైల్వేస్టేషన్లలో హెల్ప్ బూత్‌లను ఏర్పాటు చేస్తామని శ్రీవాత్సవ చెప్పారు.