Telangana Formation Day 2023: Ram Charan Extends Heartfelt Greetings To Telangana People - Sakshi
Sakshi News home page

తెలంగాణ దశాబ్దిఉత్సవాలపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

Published Fri, Jun 2 2023 3:53 PM | Last Updated on Fri, Jun 2 2023 4:29 PM

Telangana Formation Day 2023: Ram charan Wish To Telangana People - Sakshi

నేటితో(జూన్‌ 2) తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.  21 రోజుల పాటు రోజుకో రంగం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుతున్నాయి. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement