కథ విన్నారా? | There is a possibility of making a movie in the combination of NTR Nelson and Dilip Kumar | Sakshi
Sakshi News home page

కథ విన్నారా?

Published Fri, Oct 4 2024 3:59 AM | Last Updated on Fri, Oct 4 2024 3:59 AM

There is a possibility of making a movie in the combination of NTR Nelson and Dilip Kumar

హీరో ఎన్టీఆర్, తమిళ దర్శకుడు ‘జైలర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్‌ను నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథకు ఎన్టీఆర్‌ అంగీకారం తెలిపారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌ హిందీ చిత్రం ‘వార్‌ 2’ (ఇందులో హృతిక్‌ రోషన్‌ మరో హీరో)తో బిజీగా ఉన్నారు. 

త్వరలోనే ప్రశాంత్‌ నీల్‌తో చేయనున్న ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా సెట్స్‌లో జాయిన్‌ అవుతారు. మరోవైపు ‘జైలర్‌ 2’ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచే పనుల్లో ఉన్నారు నెల్సన్‌. ‘జైలర్‌’లో హీరోగా నటించిన రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’లోనూ నటిస్తారు. 

ఇలా...  ‘వార్, డ్రాగన్‌’ సినిమాలను ఎన్టీఆర్‌ పూర్తి చేశాక, అటు ‘జైలర్‌ 2’ను నెల్సన్‌ కంప్లీట్‌ చేశాక... కానీ ఎన్టీఆర్‌–నెల్సన్‌ కాంబోలోని సినిమా సెట్స్‌పైకి వెళ్లే చాన్సెస్‌ కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రావడానికి, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని ఊహించవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement