
తెలుగు దర్శకుడు వంశీ కృష్ణ పెళ్లి పీటలెక్కాడు. ప్రమీల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం నాడు ఆయన వివాహం వేడుకగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమాలివే..
వంశీ విషయానికి వస్తే.. ఈయన టైగర్ నాగేశ్వరరావు సినిమా తీశాడు. స్టువర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. ఈ సినిమా కంటే ముందు దొంగాట మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులో అడివి శేష్, లక్ష్మీ మంచు కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment