
( ఫైల్ ఫోటో )
సాక్షి, మచిలీపట్నం: ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి దాసరి వన కుచలరావు(76) కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్వగృహంనందు గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో మారుతి ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. మారుతి తండ్రి మరణవార్త తెలిసిన పలువురు సినీప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు.
కాగా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్ డిజైనర్‌గా పని చేసిన మారుతి ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత బస్ స్టాప్ మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో ప్రేమకథా చిత్రంతో నిర్మాతగా మారాడు మారుతి. అనంతర కాలంలో అల్లు శిరీష్‌తో కొత్తజంట, వెంకటేశ్‌తో బాబు బంగారం, నానితో భలే భలే మగాడివోయ్, శర్వానంద్‌తో మహానుభావుడు, నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు, సాయిధరమ్ తేజ్‌తో ప్రతిరోజు పండగే.. ఇలా ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన గోపీచంద్ పక్కా కమర్షియల్ త్వరలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment