![Trisha Krishnan Not Marrying Director - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/30/trisha.jpg.webp?itok=rqSL4S6M)
Heroine Trisha: త్రిష మెడలో మూడు ముడులు పడనున్నాయి.. ఏడడుగులు వేయడానికి రెడీ అయిపోయారు అంటూ కొన్ని రోజులుగా ఓ వార్త బాగా ప్రచారం అవుతోంది. ఓ తమిళ దర్శకుడితో ఆమె ప్రేమలో పడ్డారని కూడా కోలీవుడ్ అంటోంది. దాంతో త్రిష పెళ్లి ఫిక్స్ అని చాలామంది ఫిక్సయ్యారు. అయితే పెళ్లి ఫిక్స్ కాలేదట.
‘‘త్రిష పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇప్పట్లో ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఆమె దృష్టంతా సినిమాల పైనే ఉంది’’ అని త్రిష సన్నిహితులు పేర్కొన్నట్లుగా చెన్నై టాక్. ప్రస్తుతం మణిరత్నం దర్శ కత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు త్రిష. ఇది కాకుండా రెండు మూడు తమిళ చిత్రాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment