పెళ్లి తర్వాత రిలీజయ్యే ఫస్ట్‌ సినిమా ఇదే! | Umapathy Thambi Ramaiah Pithala Maathi Movie Release Date Out Now, Deets Inside | Sakshi
Sakshi News home page

అర్జున్‌ కూతురితో హీరో పెళ్లి.. తర్వాత రిలీజయ్యే మూవీ ఇదే!

Published Sun, Jun 9 2024 10:40 AM | Last Updated on Sun, Jun 9 2024 1:16 PM

Umapathy Thambi Ramaiah Pithala Maathi Movie Release Date Out Now

ఐశ్వర్య అర్జున్‌- ఉమాపతి రామయ్య ఎంగేజ్‌మెంట్‌ ఫోటో

సీనియర్‌ నటుడు, దర్శకుడు తంబిరామయ్య వారసుడు ఉమాపతి రామయ్య కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ పిత్తలమాత్తి. శరవణా ఫిలిం ఆర్ట్స్‌ పతాకంపై జి.శరవణన్‌ నిర్మించిన ఈ చిత్రానికి మాణిక విద్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇందులో తంబిరామయ్య, బాలా శరవణన్‌, విద్యులేఖ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది నేటి తరం ప్రేక్షకులను అలరించే ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ మూవీ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉమాపతి రామయ్య కెరీర్‌లోనూ గుర్తుండిపోయే చిత్రంగా ఉంటుందన్నారు. జూన్‌ 11న ఉమాపతి రామయ్య పెళ్లి జరగనుందని, ఆ వెనువెంటనే అంటే ఈ నెల 14న తమ చిత్రం తెరపైకి రానుండడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు. దీనికి మోస్‌ సంగీతాన్ని, ఎస్‌ఎన్‌.వెంకట్‌ చాయాగ్రహణం అందించారు.

చదవండి: కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement