50 కోట్ల మంది కోసం.. ఉపాసన సరికోత్త ఆలోచన | Upasana Konidela Tweet About Health Care Policy | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి వారి కోసం అనుకూలమైన హెల్త్‌కేర్‌ పాలసీ 

Published Mon, Aug 24 2020 4:17 PM | Last Updated on Mon, Aug 24 2020 5:01 PM

Upasana Konidela Tweet About Health Care Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనిషి జీవితంలో అత్యంత విలువైనదిగా భావించేది ప్రాణం. అందుకే ఏ చిన్న పాటి అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లే వారు కోకొల్లలు. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. కరోనా వచ్చాక మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిందనే చెప్పవచ్చు. హెల్త్‌ పాలసీలు తీసుకునే వారిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే అధికం. ఎందుకంటే వారు గవర్నమెంట్‌ ఆస్పత్రులకు వెళ్లలేరు.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్‌ హస్పటిల్‌కు వెళ్లే ధైర్యం కూడా చేయలేరు. దాంతో మధ్యే మార్గంగా ఆరోగ్యబీమా పాలసీలతో నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్‌ కవరేజ్‌ మోడల్‌ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన ట్వీట్‌ చేశారు. 

‘అందరికి అనువైన ఆరోగ్య సంరక్షణ.. 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్‌కేర్‌‌ కవరేజ్‌ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జై హింద్’‌ అంటూ ఉపాసన ట్వీట్‌ చేయడమే కాక ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ‘దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికి అనువైన హెల్త్‌కేర్‌ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ ఇన్యూరెన్స్‌ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్‌ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అన్నారు. (చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌)
 

ఎఫ్‌హెచ్‌పఎల్..
ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ (ఎఫ్‌హెచ్‌పఎల్), 1995లో విలీనం చేయబడింది. 2002 లో ఐఆర్‌డీఏ లైసెన్స్ పొందింది. నేడు దేశంలో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ పొందిన ఐఆర్‌డీఏ లైసెన్స్‌ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌లలో ఎఫ్‌హెచ్‌పఎల్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఉండగా దేశవ్యాప్తంగా 55కు పైగా స్థానాల్లో, 25 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. వ్యక్తిగత కస్టమర్లు, కార్పొరేట్ ఖాతాదారులకు, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య పథకాలకు ఆరోగ్య బీమా ప్రయోజనాల పరిపాలన అవసరాలను ఎఫ్‌హెచ్‌పీఎల్‌ అందిస్తోంది. నాణ్యత ప్రమాణాలు, ప్రక్రియల కోసం ఐఎస్‌ఓ 9001: 2008 తో ధృవీకరించబడిన మొదటి లైసెన్స్ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ కావడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement