ఫ్లైట్​లో పోగొట్టుకున్నా.. ప్లీజ్‌ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా | Urvashi Rautela Forgot Her 2 Iphone Mobiles In Flight | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి

Published Sun, Jun 25 2023 12:02 PM | Last Updated on Sun, Jun 25 2023 12:08 PM

Urvashi Rautela Forgot Her 2 Iphone Mobiles In Flight - Sakshi

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.  తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు హీటెక్కిస్తుంది ఈ బీ టౌన్​ చిన్నది. ఈ నటి ఇటీవలే ప్రపంచంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్​ అవార్డును కూడా అందుకుంది.  ఈ విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది. తాజాగ మరోసారి సోషల్ మీడియాలో ఆమె చర్చనీయాంశమైంది.  

(ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!)

ఇటీవల విమానంలో దూర ప్రయాణం చేసిన ఊర్వశి తన వద్దనున్న రెండు ఐఫోన్లను ఫ్లైట్​లోనే మరచిపోయి వచ్చేసిందట. అది వెతికేందుకు సహాయం కోరుతూ ఇన్​స్టా వేదికగా ఓ పోస్ట్‌ను ఇలా పెట్టింది. 'డియర్​ విస్తారా నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మరచిపోయాను. వాటి వాల్​ పేపర్​లో మా తల్లిదండ్రుల ఫొటో ఉంటుంది. దయ చేసి మీరు దాన్ని వెతికేందుకు సహాయం చేస్తారా' అంటూ రాసుకొచ్చింది.

కొద్దిరోజుల నుంచి టాలీవుడ్‌ సినిమాల్లోనూ మెరుస్తూ సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరు సరసన 'బాసు.. వేర్​ ఈజ్​ ద పార్టీ' అంటూ స్టెప్పులేస్తూ.. యూత్​ ఫాలోయింగ్‌ను పెంచుకుంది . ప్రస్తుతం ఆమె లో బోయపాటి-రామ్‌ పోతినేని సినిమాతో పాటు 'బ్రో' లాంటి సినిమాల్లో స్పెషల్​ సాంగ్స్​లో మెరవనుంది.

(ఇదీ చదవండి: రాధికా ఆప్టేతో రోమాన్స్‌ చేసిన ఈ నటి గురించి తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement