ఐటం పాప బాగా రిచ్‌.. ఈ డ్రెస్‌ ఖరీదు తెలిస్తే గుడ్లు తేలేస్తారు! | Urvashi Rautela Pink Versace Night Suit Cost Rs 91,000 | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: ఐటం పాప బాగా రిచ్‌.. నైట్‌ డ్రెస్సుకు ఎన్ని వేలు పెట్టిందంటే?

Published Mon, Jun 5 2023 9:33 PM | Last Updated on Mon, Jun 5 2023 9:33 PM

Urvashi Rautela Pink Versace Night Suit Cost Rs 91,000 - Sakshi

బాస్‌ పార్టీతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన గ్లామర్‌ క్వీన్‌ ఊర్వశి రౌతేలా ఈ మధ్య అస్సలు తగ్గడం లేదుగా! వరుస ఐటం సాంగ్స్‌తో కోట్లు పోగేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే రూ.190 కోట్లు పెట్టి బంగ్లా సొంతం చేసుకుంది. అక్కడిదాకా ఎందుకు.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కే రూ.93 లక్షలు ఖర్చు పెట్టింది. దుస్తులకు, నగలకు, మేకప్‌కు కూడా లెక్కలేనంత ఖర్చు పెడుతూ ఉంటుంది. గ్లామర్‌ ఫీల్డ్‌ అన్నాక ఆమాత్రం మెయింటెన్‌ చేయకపోతే ఎలా అన్నట్లుగా స్టైలిష్‌గా కనిపించేందుకే ఉన్నదంతా ఖర్చు పెడుతోంది.

అయితే మరీ విచిత్రంగా నైట్‌ డ్రెస్‌ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడమే కాస్త విడ్డూరంగా ఉంది. తాజాగా ఊర్వశి రౌతేలా ఓ తెలుగు సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఎయిర్‌పోర్టులో ఆమె పింక్‌ కలర్‌ నైట్‌ సూట్‌లో దర్శనమిచ్చింది. నైట్‌ డ్రెస్సే కదా వందల్లో ఉంటుందనుకుంటే పొరపాటే! ఆమె ధరించిన డ్రెస్‌ ధర ఏకంగా రూ.91,000 ఉంటుందట!

ఈ విషయం తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు. 'అంత సింపుల్‌గా ఉన్న డ్రెస్‌ కోసం దాదాపు లక్ష దాకా పెట్టావా? మహాతల్లి.. నువ్వు నిజంగా గ్రేట్‌', 'మీరు డబ్బున్నోళ్లు మేడమ్‌' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రో సినిమాలో ఓ ఐటం సాంగ్‌ చేసేందుకు ఊర్వశి రెడీ అయిందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సాంగ్‌కు గణేశ్‌, భాను కొరియోగ్రాఫర్లుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: నా ముఖం బాగోలేదని సర్జరీ చేయించుకోమన్నారు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement