
వాల్తేరు వీరయ్య 'బాస్ పార్టీ'తో బాగా ఫేమస్ అయింది ఊర్వశి రౌతేలా. ఐటం సాంగ్‌లతోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టే ఈ బ్యూటీకి తాజాగా పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఆమె అక్కడ ఓ హోటల్‌లో బస చేసింది. అయితే పారిస్ నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, హోటల్ గది నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది నటి.
తన గది కిటికీ నుంచి తీసిన ఈ వీడియోలో.. వీధుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావారణం స్పష్టంగా కనిపిస్తోంది. గన్ పేల్చిన శబ్ధాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో ఊర్వశి చిక్కుకోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తను వీలైనంత త్వరగా తన పని ముగించుకుని క్షేమంగా ఇండియాకు తిరిగిరావాలని కోరుకుంటున్నారు.
ఇకపోతే బాలీవుడ్‌లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్ పంటి లాంటి చిత్రాల్లో తళుక్కుమని మెరిసిన ఊర్వశి 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇటీవల 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment