Actress Vedhika Pink Bikini Photoshoot Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vedhika Viral Photos: బికినీలో గ్లామర్‌ ఒలకబోస్తున్న హీరోయిన్‌ వేదిక..

Published Mon, Aug 1 2022 5:39 PM | Last Updated on Mon, Aug 1 2022 8:10 PM

Vedhika Pink Bikini Photoshoot Goes Viral In Social Media - Sakshi

Vedhika Pink Bikini Photoshoot Goes Viral: బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలరాతి శిల్పంలా మెరిసే వేదిక దశాబ్దన్నరకు పైగానే చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తోంది. తమిళంలో పరదేశి, ముని, ముని–4 తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వినోదన్, జంగిల్‌ వంటి చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో బాలకృష్ణ, తమిళంలో శింబు, లారెన్స్‌ వంటి హీరోలతో నటించింది. 

అందం, ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా నటిగా ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది వేదిక. దీంతో పాపులారిటీ కోసం తెగ ఆరాటపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకుంది వేదిక. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులో రకరకాల గ్లామరస్‌ దుస్తులతో ఫొటో షూట్‌ చేసుకుని ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అలా ఆమెకు ప్రస్తుతం 34 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. తాజాగా మాల్దీవుల్లో పింక్‌ బికినీ వేసుకుని దిగిన ఫొటోలను ఈ బ్యూటీ విడుదల చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇవైనా ఈ అమ్మడికి ఏ పాటి అవకాశాలు తీసుకొస్తాయో చూడాలి.  

చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన
నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement