oppurtunities
-
నాకు కాళ్లు లేకపోయినా ప్రజలకు వాలంటీరుగా సేవ చేసే అవకాశం కల్పించారు.. నాకు పెన్షన్ కూడా ఇస్తున్నారు..!
-
బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా?
Vedhika Pink Bikini Photoshoot Goes Viral: బ్యూటీఫుల్ హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలరాతి శిల్పంలా మెరిసే వేదిక దశాబ్దన్నరకు పైగానే చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తోంది. తమిళంలో పరదేశి, ముని, ముని–4 తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వినోదన్, జంగిల్ వంటి చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో బాలకృష్ణ, తమిళంలో శింబు, లారెన్స్ వంటి హీరోలతో నటించింది. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా నటిగా ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది వేదిక. దీంతో పాపులారిటీ కోసం తెగ ఆరాటపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకుంది వేదిక. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులో రకరకాల గ్లామరస్ దుస్తులతో ఫొటో షూట్ చేసుకుని ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అలా ఆమెకు ప్రస్తుతం 34 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. తాజాగా మాల్దీవుల్లో పింక్ బికినీ వేసుకుని దిగిన ఫొటోలను ఈ బ్యూటీ విడుదల చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవైనా ఈ అమ్మడికి ఏ పాటి అవకాశాలు తీసుకొస్తాయో చూడాలి. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) 🧞♀️🐚 pic.twitter.com/Mx0G9NuKMv — Vedhika (@Vedhika4u) August 1, 2022 Listen to the sound of waves within you 🐚🦢 pic.twitter.com/Hipz0n2Wd7 — Vedhika (@Vedhika4u) July 29, 2022 -
కొలువుల ‘భాగ్య’నగరం
సాక్షి, హైదరాబాద్: సర్వమతాల సమాహారంగా.. కాస్మోపాలిటన్ సిటీగా... మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరం మరో గుర్తింపును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నత చదువులు చదివిన యువతలో అత్యధికం ఉద్యోగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే ముందంజలో ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలి చాయి. కరోనా వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యాలు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ను (డబ్ల్యూఎన్ఈటీ) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతోపాటు 15 పరిశ్రమలను, 150కిపైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. క్రిటికల్ థింకింగ్‌లో నాలుగో స్థానంలో తెలంగాణ క్రిటికల్ థింకింగ్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్–10 జాబి తాలో 4వ స్థానంలో నిలిచారు. ఆంగ్లభాషా నైపుణ్యంలో రాష్ట్ర విద్యార్థులు ఐదో స్థానంలో ఉన్నారు. న్యూమరికల్ స్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదో స్థానంలో ఉండగా తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు. వృత్తి, సాంకేతిక విద్యా సంబంధ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ పరంగా చూస్తే ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ స్కిల్స్‌లో రాజస్తాన్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. టాప్–10 రాష్ట్రాలవారీగా చూస్తే అక్కడి విద్యార్థులే తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం, న్యూమరికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్‌లో మధ్యప్రదేశ్ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. కంప్యూటర్ స్కిల్స్‌లో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో ముందున్నా కేరళకు లభించని చోటు... కేరళ అక్షరాస్యతలో ముందు వరుసలో ఉన్నా ఉద్యోగార్థులున్న టాప్–10 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం నిలువలేకపోతోంది. అయితే ఆంగ్ల భాష, న్యూమరికల్ స్కిల్స్‌లో మాత్రం టాప్–10లో నిలిచింది. మాతృ భాష కాకుండా రెండో భాషగా ఇంగ్లిష్, స్కిల్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్ తొలి స్థానం సంపాదించింది. అక్కడ కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన పట్టణాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న పట్టణాలుగా నిలిచాయి. -
ఉపాధి 'ఆశలు'..!
కొత్త రాష్ట్రం.. కరువు జిల్లా.. వానలు లేక వ్యవసాయం పాడెక్కింది ఉపాధి లేక వలసల దోవ పెరిగింది భారీ పరిశ్రమల హామీ కొండెక్కింది పల్లెల్లో అసహనం.. అశాంతి.. ఆకలి కొత్త ప్రభుత్వ పాలనలో అంతా నిస్తేజం అంధకారంలో చిరుదీపంలా కేంద్ర ప్రభుత్వ ఆశ ‘పీఎంఈజీపీ’ పలు ప్రాజెక్టులతో గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల అవకాశం కల్పించే ఉన్నత పథకం.. నిన్నటిదాకా.. అదీ ఘాడనిద్రలోనే ఉంది నీతి ఆయోగ్ బృందం తాజా పర్యటన ఉపాధి అవకాశాలపై ఊహల విమానం ఎక్కిస్తోంది..! ఒంగోలు: ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం(పీఎంఈజీపీ)ను గ్రామాలతో పాటు పట్టణాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 2008లో కేంద్రం ఉనికిలోకి తెచ్చింది. వివిధ రకాల ప్రాజెక్టులను లబ్ధిదారులే ఎంపిక చేసుకోవాలి.అయితే దీనిపై మొదటి నుంచి నిర్లిప్త ధోరణే కొనసాగుతోంది. యూనిట్ల సంఖ్య నుంచి పథకం ఉనికిపై నిరుద్యోగులకు ఎన్నో సందేహాలు. మరుసటి సంవత్సరమే జిల్లా పరిశ్రమల కేంద్రానికి బాధ్యతలు అప్పగించారు. కేటాయింపుల్లోనే నిర్లక్ష్యం.. మొదటి ఆర్థిక సంవత్సరం 2019–10లో జిల్లాకు 104 యూనిట్లను లక్ష్యాన్ని నిర్దేశించి రూ.112.29 కోట్లు మంజూరు చేశారు. 2010–11లో 113 యూట్లను టార్గెట్ ఇచ్చి రూ.135.37 కోట్లను మాత్రమే మార్జిన్ నిధిగా ఇచ్చారు. 2011–12 వచ్చేసరికి అసలు యూనిట్లనే కేటాయించలేదు. ఆ తరువాత ఏడాది కేవలం 55 యూనిట్లను మాత్రమే మంజూరు చేసి.. రూ.126. 32 కోట్లు విడుదల చేశారు. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 76 యూనిట్లను మంజూరు చేయగా రూ.107.17 కోట్లు కేటాయించారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ 76 యూనిట్లు టార్గెట్ ఇచ్చి రూ.108. 04 కోట్లను మార్జిన్ నిధిగా చూపించారు. కాగా గత ఏడాది కేవలం 32 యూనిట్లను మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. విధివిధానాలు ఏవీ? ఈ ఏడాది ఈ పథకం లక్ష్యాల అమలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి సారీ ఇదే తంతు కొనసాగుతుండటంతో ఔత్సాహికులు నిరుత్సాహ పడుతున్నారు. కానీ కొంతమంది నిరుద్యోగులు మాత్రం ఈ ఏడాది కూడా ఆన్లైన్ల∙దరఖాస్తు మాత్రం చేసుకుంటున్నారు. దీంతో జిల్లా పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ నుంచి నీతి ఆయోగ్ బృందం సభ్యులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ అధికారి పి.జె. రాధాకృష్ణ, మరో ఇద్దరు సభ్యులు జిల్లా డీఐసీ అధికారులతో కలిసి విడివిడిగా పర్యటించారు. నేరుగా.. కందుకూరు డివిజన్, సింగరాయకొండ, ఒంగోలు డివిజన్లో ఒంగోలు, ఒంగోలు రూరల్, చీరాల డివిజన్లో శుక్రవారం పర్యటించి క్షేత్రస్థాయిలో యూనిట్లను తని ఖీలు చేశారు. గత నాలుగేళ్లుగా యూనిట్లు నెలకొల్పిన లబ్ధిదారులతో మాట్లాడారు. ఖాతాల లావాదేవీలు, నిర్వహణ, నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి దాకా స్తబ్ధుగా ఉన్న కేంద్రంలో ఒక్కసారిగా కదలిక రావడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జిల్లాకు స్థానం ఈ పథకం కింద 12 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. కాగా ఏపీలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చోటు దక్కింది. ఈ జిల్లాల్లో అమలవుతున్న పీఎంఈజీపీ పథకం తీరుతెన్నులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరడంతో ఈ పరిణామం సంభవించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలోనే కేవీఐసీ, కేవీఐబీ స్కీంలను కూడా అమలు చేయాలని డిక్కీ ప్రతినిధి బృందం నీతి ఆయోగ్ కమిటీకి తెలియజేశారు. యూనిట్ల సంఖ్యను పెంచి జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిస్తామని డిక్కీ ప్రతినిధి భక్తవత్సలం తెలిపారు.