నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌ | Vijay Devarakonda Request Ananya to Stop Flirting With Him in Koffee Karan | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌

Published Thu, Jul 28 2022 10:59 AM | Last Updated on Thu, Jul 28 2022 11:48 AM

Vijay Devarakonda Request Ananya to Stop Flirting With Him in Koffee Karan - Sakshi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంలో యూత్‌లో అతడికి విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. తనదైన స్టైల్‌, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక అమ్మయిల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే లైగర్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ అక్కడ సైతం మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. కేవలం అభిమానుల మనసులనే కాదు బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్ల మనసుని కూడా దోచేస్తున్నాడు ఈ ‘రౌడీ’.

చదవండి: షూటింగ్‌ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ

ఇటీవల కరణ్‌ జోహార్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’లో సారా అలి ఖాన్‌, జాన్వీ కపూర్‌లు విజయ్‌పై మనసు పారేసుకున్నట్లు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో విజయ్‌, తన ‘లైగర్‌’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి సందడి చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫుల్‌ ఎపీసోడ్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ ఎపిసోడ్‌లోపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది హాట్‌స్టార్‌. తాజాగా అనన్యతో నాకు సైట్‌ కొట్టకు అంటూ విజయ్‌ క్యూట్‌గా రిక్వెస్ట్‌ చేసిన వీడియోను డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

చదవండి: ప్రెగ్నెన్సీపై విమర్శలు.. ఆగ్రహించిన ఆలియా భట్‌

అందులో అనన్యతో సరదాగా తెలుగులో మాట్లాడుతూ కనిపిచాడు విజయ్. ‘అనన్య నువ్వు చాలా ముద్దు పిల్లవి కానీ ఉరికే ఇట్ల నా మీద లైన్‌ వేయకు! వద్దు’ అంటూ అనన్యను తెలుగులో రిక్వెస్ట్‌ చేస్తాడు. దీనికి ఆమె ‘వావ్‌.. చాలా బాగుంది. మళ్లీ ఒకసారి చెప్పువా’ అంటూ కోరింది. దీంతో వీరిద్దరి మధ్యలో కరణ్‌ వచ్చి.. ‘అతను నువ్వు క్యూట్ అని చెబుతున్నాడు. కానీ తనని ఫ్లర్ట్ చేయడం ఆపమంటున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అనన్య బుంగ మూతి పెట్టుతుంది. ఈ వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement