అక్టోబరులో ఆరంభం | Vijay Deverakonda Upcoming Movies Update | Sakshi
Sakshi News home page

అక్టోబరులో ఆరంభం

Published Mon, Sep 30 2024 3:15 AM | Last Updated on Mon, Sep 30 2024 3:15 AM

Vijay Deverakonda Upcoming Movies Update

‘టాక్సీవాలా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 19వ శతాబ్దపు నేపథ్యంలో 1854 – 1878 టైమ్‌ పీరియడ్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందని, ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటివారంలో ప్రారంభమయ్యేలా యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement