
Arabic Kuthu Song Records: తలపతి విజయ్, పూజా హెగ్డేల తాజా చిత్రం బీస్ట్. ఇటీవల మూవీ నుంచి విడుదలైన అరబిక్ కుతు సంచలన సృష్టించింది. విడుదలైన గంటల వ్యవధిలోనే మిలియన్‌పైగా వ్యూస్ తెచ్చుకుంది. దీంతో అరబిక్ కుతు పాన్ వరల్డ్ సాంగ్‌గా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో విజయ్, పూజలు వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలెబ్రెటీల వరకు ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇక ఇన్‌స్టాలో హలమితి హబిబో అంటూ రీల్స్ చేస్తున్నారు. ఇటీవల సమంత సైతం ఈ పాటకు రిల్ చేసి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.
చదవండి: రష్మిక మొత్తం ఆస్తి, ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
తమిళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రెజెంట్ 60 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేందుకు రెడీగా ఉన్న అరబిక్ కుత్తు.. 48 గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో కూడా ప్లేస్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఇక ఈ పాటకు టాంజెనియన్ టిక్ టాకర్ కిలి పాల్ కూడా స్టేప్పులేశాడు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ అరబిక్ కుతు సాంగ్ ట్యూన్ మోరుమ్రోగుతోంది. ఒక్క పాటతో సెన్సేషనల్‌గా మారిన విజయ్ బీస్ట్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 14న సినిమా థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చదవండి: విజయ్ పిరికివాడు: అనన్య షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment