బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ హిందీ చిత్రాల్లో నటిస్తూనే దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారన్నది తెలిసిందే. వివాదాలకు కేరాఫ్‌గా మారిన ఈమె ఇంతకుముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన 'తలైవి' చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో వస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్‌ను కూడా ఆమె పూర్తి చేసుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో లారెన్స్ కథానాయకుడిగా నటించారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్‌లో సీన్స్)
మరో తమిళ చిత్రంలో నటించడానికి కంగనా రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ట్రైడెంట్ ఆర్ట్స్, అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఒక తమిళ నటుడు, హిందీ నటి కలిసి నటించబోతున్నట్లు ఇంతకముందే వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనతోపాటు కంగనా నటించనున్నట్లు తెలిసింది.
(ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న)
దీనికి మలయాళం టాప్ దర్శకుడు విపిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. కాగా నటి కంగనా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్న హిందీ చిత్రం ఎమర్జెన్సీ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment