గల్లీ బాయ్, దహాద్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు విజయ్ వర్మ. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం తమన్నా ప్రియుడిగానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. తాజాగా అతడు తను పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో నేను ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను. అప్పుడు నా బ్యాంక్ అకౌంట్‌లో రూ.18 ఉండేవి. ఆ సమయంలో నాకు మంచి అవకాశాలు కూడా రాలేదు. అప్పుడు నన్ను రిపోర్టర్‌గా చేయమని అడిగారు.
ఒక్క రోజే షూటింగ్, మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు. అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేకపోయినా డబ్బు కోసం ఒప్పుకున్నాను. మనసును బండరాయి చేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ ఆ రిపోర్టింగ్ కూడా ఇంగ్లీష్‌లో చేయమన్నారు. అది అంత ఈజీగా లేదు. దీంతో సెట్‌లోనే నన్ను రిజెక్ట్ చేశారు. అప్పటికే నేను మాన్‌సూన్ షూట్ అవుట్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాను. అయినా సరే ఇలా చిన్నాచితకా పాత్రలు చేస్తూ చీవాట్లు తినాల్సిన దయనీయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ రోజు నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లాను. డబ్బు కోసం ఏది పడితే అది చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ సంఘటన 2014లో జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు డబ్బుల కోసం ఆలోచించడం మానేసి నాకు నచ్చిన పాత్రలు మాత్రమే చేసుకుంటూ వస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా విజయ్ వర్మ ప్రస్తుతం అఫ్గానీ స్నో, మర్డర్ ముబారక్‌తో పాటు సూర్య 43వ చిత్రంలోనూ నటిస్తున్నాడు.
చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? హంతకుడు దొరికినట్లే?! అమర్ మీద శివాజీ అక్కసు..
Comments
Please login to add a commentAdd a comment