
సాక్షి, ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ నేటితో ( శుక్రవారం, డిసెంబరు 11, 2020) ముచ్చటగా మూడవ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఈ సెలబ్రిటీ కపుల్‌కి సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న తరుణంలో ఈ ఏడాది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు క్రికెట్ అభిమానులు,ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ విరుష్క జంటకు శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. దీంతో ట్విటర్లో ట్రెండింగ్‌గా విరుష్కాల పెళ్లిరోజు మారడం విశేషం.
ఆల్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ తమ మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య అనుష్కకు ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. అటు అనుష్క శర్మ కూడా ఇన్‌స్టాలో తన ఫీలింగ్స్‌ను పంచుకున్నారు. మూడేళ్ల బంధం.. త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం..మిస్ యూ అంటూ వ్యాఖ్యానించారు. 2017, డిసెంబర్ 11న కోహ్లీ, అనుష్కల పెళ్లి జరిగింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన ఈ పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే.
3 years and onto a lifetime together ❤️ pic.twitter.com/a30gdU87vS
— Virat Kohli (@imVkohli) December 11, 2020
Comments
Please login to add a commentAdd a comment