Anchor Vishnu Priya Bold Reply To Her Fan Who Disappointed Her Hot Photoshoot - Sakshi
Sakshi News home page

అక్కా ముఖం చూపించుకోలేకపోతున్నాం.. విష్ణుప్రియ రిప్లై

Published Tue, May 11 2021 3:21 PM | Last Updated on Tue, May 11 2021 3:52 PM

Vishnu Priya Strong Reply To Fan Who Disappointed For Photoshoot - Sakshi

కరోనా సమయంలో సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తున్న పలువురు సెలబ్రిటీలను నెటిజన్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది మీ వినోదం కోసమేనంటూ పలువురూ ధీటైన సమాధానమిస్తూ నెటిజన్ల నోరు మూయిస్తున్నారు. ఈ క్రమంలో సారీ కట్టుకున్న ఫొటోలను షేర్‌ చేసిన విష్ణుప్రియను కూడా కొందరు విమర్శించడం మొదలు పెట్టారు.

"అక్కా మా ముఖాలు చూపించలేకపోతున్నాం. మీ ప్రియా చూడు ఎలా పెడుతుందో పిక్స్‌ అంటున్నారు! కొద్దిగా మంచిగ పెట్టు అక్కా" అంటూ దియా అనే అభిమాని అసహనం వ్యక్తం చేస్తూనే మంచి ఫొటోలు పెట్టంటూ అభ్యర్థించాడు. ఇది చూసిన విష్ణుప్రియ.. నానా దియా.. నువ్వు రాయిలో కూడా దేవుడిని చూడవచ్చు. అదంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే నా వృత్తిలో రకరకాల బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అంతమాత్రాన నన్ను తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు. దీన్ని అర్థం చేసుకునే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని విష్ణుప్రియ ఘాటుగా సమాధానమిచ్చింది.

చదవండి: ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement