
హీరోయిన్ యామీ గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు. ఎందుకంటే ఆమె నటిగా కంటే కూడా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ యాడ్‌తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. గ్లోయింగ్ స్కీన్ కావాలా? అంటూ టీవీలో ప్రతి రోజు పలకిస్తుంది ఆమె. అయితె ఆమె స్కీన్ కలర్, గ్లో చూసి అందరు షాకవుతుంటారు. ముఖంపై మచ్చ లేకుండా నిగినిగ మెరిసిపోయే ఆమె చర్మం చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతుంటారు. అంతటి గ్లోయింగ్ స్కీన్ కోసం యామీ ఏం చేస్తుందా? అని ప్రతెలుసుకోవాలని ప్రతి అమ్మాయికి ఆసక్తి ఉండి ఉంటుంది కదా. తాజాగా వారి కోసం తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది యామీ గౌతమ్.
అమ్మ చెప్పింది.. టీనేజ్ నుంచి అదే ఫాలో అవుతున్నా
కొత్తగా గ్లో తెచ్చుకోవడమెలా అన్నదాని కంటే ఉన్న స్కిన్‌ను సంరక్షించుకోవడమెలా అనేదాని మీదే దృష్టి పెడతా. దీని కోసం మా అమ్మ చెప్పిన చిట్కా ఫాలో అవుతున్నా.. నా టీనేజ్ నుంచీ. చక్కగా బియ్యప్పిండిలో పాలు కలిపి స్క్రబ్బర్‌లా యూజ్ చేస్తా. కొంచెం తేనెలో కాస్త గ్లిజరిన్, ఓ టీస్పూన్ నిమ్మరసం.. రోజ్ వాటర్ కలిపి మృదువుగా మొహానికి రాస్తా. ఇది క్లెన్సర్‌లా పనిచేయడమే కాక.. చర్మంలోని తేమను కాపాడుతూ.. నిగనిగలాడేలా చేస్తుంది! అని చెప్పింది యామీ.
Comments
Please login to add a commentAdd a comment