విద్యార్థులకు ఆలయ విశిష్టతను వివరిస్తున్న గైడ్ వెంకటేశ్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మ క రామప్ప దేవాలయంలో శనివారం విద్యార్థుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం రామలింగేశ్వరున్ని త్రిశూలం, ఓంకారం ఆకారంతో ప్రత్యేకంగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమల్లపల్లి హరీష్‌శర్మ తెలిపారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ కేరింతలు కొట్టారు.