
ప్రజలను చైతన్యం చేయాలి
భూపాలపల్లి రూరల్: కవులు, కళాకారులు తమ నైపుణ్యంతో ప్రజలను చైతన్యం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని పుష్పగార్డెన్‌లో వివేకనంద సేవా సమితి వ్యవస్థాపకుడు కొల్గూరి సంజీవరావు అధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కవులు, కళాకారులను పురస్కారాలతో సత్కరించారు. కవి సమ్మేళనం కార్యక్రమాలు భవిష్యత్‌లోనూ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఆర్ సంపత్‌రావు, హాస్యనటుడు ఆర్‌ఎస్ నందా తదితరులు పాల్గొన్నారు.
ఉగాది శుభాకాంక్షలు
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ నుంచి ప్రభుత్వం రేషన్‌లో సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషకరమన్నారు.
కవి, కళాకారులను సత్కరించిన
ఎమ్మెల్యే గండ్ర