
రవాణాకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో..
ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం జనగలంచ వద్ద సోలార్ ప్యానెల్, బోరును అమర్చుతున్న సిబ్బంది
రవాణాకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో సోలార్ బోర్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దట్టమైన అడవిలో నీటి బోర్లను దింపి సోలార్ పంపుసెట్లు అమర్చి మోటార్లకు సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో మోటార్లతో నీటిని ఎత్తిపోయించి పక్కనే ఉన్న కుంటలను నింపుతున్నారు. వాగుల ద్వారా నీరు దిగువకు పోకుండా చెక్‌డ్యామ్‌లు నిర్మించి నీటిని నిల్వ చేస్తున్నారు. దీనివల్ల విద్యుత్ బారం, ట్యాంక్‌ల ద్వారా నీటిని తరలించే ఇబ్బంది లేకుండా సజావుగా వన్యప్రాణులకు నీరు అందే అవకాశాలున్నాయి. ఏటూరునాగారం, ఎస్‌ఎస్ తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేట, వాజేడు మండలం దూలాపురం ప్రాంతాల్లో సుమారుగా 100 సోలార్ బోర్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. అదే విధంగా బీట్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, బేస్‌క్యాంపు సిబ్బంది ప్రతిరోజూ ఫారెస్ట్ వాచ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.