దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి | - | Sakshi

దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి

Apr 13 2025 1:12 AM | Updated on Apr 13 2025 1:12 AM

దేవున

దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి

ములుగు రూరల్‌: కొత్తూరు దేవునిగుట్టపై ఉన్న పురాతన ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ చైర్మన్‌ వీరమనేని కిషన్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శని, ఆది వారాలలో గుట్టపై నెలకొన్న లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు గుట్టపై తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామం నుంచి గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. గుట్టపైకి వెళ్లే మార్గంలో రాతి మెట్లు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించారని వాటిపై కాంక్రిట్‌ వేయించాలని కోరారు. ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్‌రావు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి

వెంకటాపురం(ఎం): భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలకు కార్మికులు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బండి నర్సయ్య అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికులతో శనివారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికుల పోరాటాల ఫలితంగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు అయిందని తెలిపారు. ఈనెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ద్వితీయ మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొక్కుల రాజేందర్‌, తోట సంపత్‌, దేవేందర్‌, సురేష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అడవికి నిప్పు పెట్టొద్దు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: తునికాకు కొమ్మకొట్టే సమయంలో లేబర్లు అడవిలో నిప్పు పెట్టొద్దని తునికాకు కాంట్రాక్టర్లు గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. మొట్లగూడెం యూనిట్‌ పరిధిలోని ముత్తాపురం, ఎనగందుల తోగు, వెంగ్లాపూర్‌, గొన్నెపల్లి, ఎల్బాక, పడిగాపూర్‌ గ్రామాల్లో పరిసరాల్లోని అడవుల్లో నిప్పు పెట్టొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందుకు గ్రామాల్లోని ప్రజలకు వారు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యానాల సిద్ధారెడ్డి గ్రామాల్లోని ప్రజలను కలిసి మాట్లాడుతూ కొమ్మకొట్టే సమయంలో బీడీ, చుట్ట, సిగరేట్‌ వెంట తీసుకెళ్లొద్దని సూచించారు. అడవులకు నిప్పు పెడితే అటవి సంపద కాలిపోతుందన్నారు. నిప్పు పెట్టకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

మోదీ చిత్రపటం

ఏర్పాటు చేయాలి

ములుగు రూరల్‌: రేషన్‌ షాపుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శనివారం చలో గావ్‌ అభియాన్‌ చలో బస్తీ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ములుగు, పంచోత్కులపల్లిలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు 5కిలోల బియ్యం అందిస్తుందన్నారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి సడక్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా రైతులకు రూ. 6వేలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ భూక్య జవహర్‌లాల్‌, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్‌, రవీంద్రాచారి, కృష్ణాకర్‌, రవీందర్‌రెడ్డి, రవిరెడ్డి, నాగరాజు, గాదం కుమార్‌, పాపిరెడ్డి, శ్రీహరి, ప్రశాంత్‌, రాజేష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి
1
1/2

దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి

దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి
2
2/2

దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement