
పోతుగంటి భరత్‌కుమార్
పూర్తిపేరు: పోతుగంటి భరత్‌కుమార్
తల్లిదండ్రులు: పోతుగంటి భాగ్యలక్ష్మి, రాములు (ప్రస్తుత ఎంపీ)
సామాజిక వర్గం: ఎస్సీ(మాదిగ)
పుట్టిన తేదీ: 07–08–1987
స్వస్థలం: గుండూరు, కల్వకుర్తి మండలం
నివాసం: టీచర్స్ కాలనీ అచ్చంపేట
చదువు: బీటెక్, ఎంబీఏ(జెఎన్‌టీయూ),ఎల్‌ఎల్‌బీ(ఉస్మానియా)
రాజకీయ ప్రవేశం, పదవులు: భరత్ ప్రసాద్ తండ్రి రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉన్నారు. తండ్రి సూచన మేరకు 2019లో బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) నుంచి రాజకీయ రంగప్రవేశం చేశారు. అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి వల్ల రెండుసార్లు జెడ్పీచైర్మన్ పదవి దగ్గరికి వచ్చి చేజారింది. దీంతో బీఆర్‌ఎస్‌లో ఇమడలేక ఇటీవల తండ్రితో కలిసి కమలం గూటికి చేరారు. ప్రస్తుతం భరత్ రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment