అటవీశాఖ సిబ్బందికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై శిక్షణ
మన్ననూర్: అటవీశాఖ ఈసీ ప్రాంగణంలో సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్ననూర్, మద్దిమడుగు రేంజ్ పరిధిలోని ఫారెస్టు సిబ్బంది ఆయా రేంజ్‌లలో వన్యప్రాణులు, అటవీ సంపద విషయంలో క్రైం, నష్ట పరిహారాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి సమక్షంలో అడ్వకేట్ తిరుపతి ఫైల్ కోఆర్డినేటర్ బాపురెడ్డి సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో (నల్లమల) పెద్దపులులతోపాటు ఇతర వన్యప్రాణులు, అడవులు, టూరిజం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతున్న క్రమంలో అటవీశాఖ సిబ్బంది ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, బీఎఫ్‌ఓలు, వాచర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment