శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు ముఖ్యం

Oct 11 2024 1:06 AM | Updated on Oct 11 2024 1:06 AM

శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు ముఖ్యం

శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు ముఖ్యం

నాగర్‌కర్నూల్‌ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో ఆయుధాలు ఎంతో ముఖ్యమని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. గురువారం దుర్గాష్టమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ బలగాల కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా దుష్టసంహారం కోసం ఆయుధాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆయుధాలు, సమస్త యంత్రాల్లో అంతర్లీనంగా దుర్గాదేవి చైతన్యశక్తి స్వరూపిణిగా ఉంటుందన్నారు. అందుకోసమే దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలను దుర్వినియోగ పరచకూడదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్‌, ఏఆర్‌ ఏఎస్పీ భరత్‌ కుమార్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ కనకయ్య గౌడ్‌, ఎస్‌ఐ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement