దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
నాగర్‌కర్నూల్: వికారాబాద్‌లో అధికారులపై దాడికి పాతల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు టీజీఓ, టీఎన్‌జీఓ, ఉతర ఉద్యోగ సంఘాల అధికారులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో టీజేఏసీ పిలుపుమేరకు వికారాబాద్‌లో అధికారులపై దాడికి నిరసనగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. టీజీఓస్, టీఎన్జీఓస్, ఉపాధ్యాయ, కార్మిక, సంఘాల నేతలు పాల్గొని దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులైన వారిని వెంటనే శిక్షించి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు ఖాజామైనొద్దీన్, కోశాధికారి రాజు, టీఎన్జీఓస్ కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి ఎండీ షర్ఫుద్దీన్, యూటీఎఫ్ నాయకులు తిరుపతయ్య, శోభన్‌బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి


