రైస్‌మిల్లులో తనిఖీలు
కల్వకుర్తి: పట్టణంలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర రైస్‌మిల్లులో శనివారం అడిషనల్ కలెక్టర్ అమ రేందర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యం, ఇప్పటి వరకు అప్పగించిన సీఎంఆర్ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి బకాయిపడిన బియ్యా న్ని వెంటనే అందించాలని యజమానిని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి ఉన్నారు.
నిర్లక్ష్యంతోనే ప్రమాదం
నాగర్‌కర్నూల్‌రూరల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తిగా పరీక్షించకుండా పనులు చేపట్టడంతోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల తర్వాత పనులను తిరిగి ప్రారంభించిన అధికారులు.. టన్నెల్ సురక్షితంగా ఉందా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికు ల ప్రాణాలను కాపాడాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్, గోపాల్, శివకృష్ణ ఉన్నారు.
సమగ్ర విచారణ జరపాలి..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భారీ వర్షాల కారణంగా సొరంగం పనులు నిలిచిపోవడంతో పాటు మిషన్లు కూడా నీటిలో మునిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పనులను పునఃప్రారంభించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు, శంకర్‌నాయక్, శివవర్మ తదితరులు ఉన్నారు.
రైస్‌మిల్లులో తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment