గడువులోగా సీఎంఆర్ అప్పగించకపోతే చర్యలు
కల్వకుర్తి రూరల్: మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిపడిన సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా అప్పగించకపోతే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్‌లోని రైస్‌మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్ల వారీగా బకాయి సీఎంఆర్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఎస్‌ఓ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను మార్చి 17వ తేదీలోగా ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. త్వరలోనే మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. అప్పటిలోగా పెండింగ్ సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపారు. ఇప్పటికే ఎంతో సమయం ఇచ్చామని.. ఇదే చివరి అవకాశమని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనునాయక్, తహసీల్దార్ ఇబ్రహీం, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు పోలా ఏకనాథం, రాంరెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment