సత్వర న్యాయం అందేలా చూడాలి
నాగర్‌కర్నూల్ క్రైం: కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయమూర్తులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి శరత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో మెడికల్ డిస్పెన్సరీ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం న్యాయ సేవలు, చట్టాల అమలు, వివిధ శాఖల విధులపై చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయస్థానాల ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికల్ డిస్పెన్సరీ యూనిట్‌తో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఉచితంగా వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో 400 మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత పరీక్షలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి రాజేశ్‌బాబు, సీనియర్ సివిల్‌జడ్జి సబిత, న్యాయమూర్తులు శ్రీదేవి, కావ్య, శ్రీనిధి, ఏఎస్పీ రామేశ్వర్, డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బార్ కౌన్సిల్ సభ్యుడు హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment