విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నాగర్‌కర్నూల్ క్రైం/చారకొండ/వెల్దండ/: విద్యుత్ బకాయిలు పెండింగ్ లేకుండా ప్రతినెలా వసూలు చేయాలని విద్యుత్‌శాఖ రెవెన్యూ విభాగం జనరల్ మేనేజర్ తులసీ నాగరాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో శనివారం సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల వసూలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు చారకొండ, సిర్సనగండ్ల గ్రామాల్లో ఆమె పర్యటించి విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ప్రతినెలా బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అర్హులందరూ గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి, గుండాల అంబా రామలింగేశ్వరస్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ పాల్‌రాజ్, డీఈ శ్రీధర్‌శెట్టి, టెక్నికల్ డీఈ రవికుమార్, పార్ధసారథి, శ్రీనివాస్, ఏఈ జానకీరాం నాయక్, శంకర్, వెంకటయ్య రాఘవేందర్‌గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment