లక్ష్యం.. చేరేనా?
జిల్లాలోని పంచాయతీల్లో 45.76 శాతమే పన్నుల వసూలు
●
మరో 35 రోజుల్లో..
జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో ఏరియర్స్, ప్రస్తుత బకాయిలు కలిపి రూ.7,22,46,200 పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.3,30,63,349 పన్నులు (45.76 శాతం) వసూలు చేశారు. ఇంకా రూ.3,91,82,851 వసూలు చేయాల్సి ఉంది. ఇందుకోసం మార్చి 31 చివరి గడువు కావడంతో మరో 35 రోజుల్లో రూ.3.91 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలోని చాలా గ్రామాలు నిధుల లేమితో కనీసం కార్మికుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి.
ఆదేశాలు జారీ చేశాం..
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు గడువులోగా వందశాతం పన్నుల వసూలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. గడువులోగా అనుకున్న లక్ష్యం చేరుకుంటాం.
– రామ్మోహన్, డీపీఓ
నాగర్‌కర్నూల్: పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నిధులు సక్రమంగా రాకపోవడంతో గ్రామాలు కుంటుపడుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం పలు చిన్న గ్రామాలను పంచాయతీలుగా గుర్తించి నిధుల విడుదల పెంచింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సర్పంచ్‌ల పదవీకాలం కూడా ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వం పాలనా బాధ్యతలు ప్రత్యేకాధికారులకు అప్పగించారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాకపోవడంతో పంచాయతీల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. చిన్న గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. కనీసం ట్రాక్టర్ కిస్తులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పల్లెలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల సహకారం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసం జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేందుకు అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
461 పంచాయతీలు..
జిల్లాలో మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో మురుగు కాల్వల శుభ్రం, తాగునీటి వసతి, మొక్కల పెంపకం, ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వంటి నిర్మాణాలు చేపట్టారు. వీటితోపాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేయించి చెత్త సేకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో ఆయా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి. ఈ క్రమంలోనే గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా పన్నుల రూపంలో నిధులు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆర్థిక సంవత్సరం గడువు
మరో 35 రోజులే..
నిధులు లేక నీరసిస్తున్న పంచాయతీలు
గ్రామాల్లో కుంటుపడుతున్న
అభివృద్ధి పనులు
Comments
Please login to add a commentAdd a comment