కమనీయంగా.. శ్రీనివాసుడి కల్యాణం
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని సుభాష్‌నగర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పండితులతోపాటు స్థానిక వేద పండితుల సమక్షంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామివార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ చైర్మన్ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో వేదికపైకి తీసుకువచ్చారు. హరీశ్వర దాండియా బృందం నృత్యాలు అలరించాయి. వేడుకలలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు, మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్, సీఐ నాగార్జున, ఎస్‌ఐ మాధవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రమాకాంత్‌రెడ్డి, కొండల్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కమనీయంగా.. శ్రీనివాసుడి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment