మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నం
నాగర్‌కర్నూల్: ఇంటి పన్ను అడిగేందుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించడంతో సదరు వ్యక్తిపై మున్సిపల్ కమిషనర్ నరేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో శనివారం ఉదయం వార్డు ఆఫీసర్ కుమార్ కొంతమంది సిబ్బందితో కలిసి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. అయితే కొట్ర లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ఇంటి పన్ను అడగడంతో పన్నులేదు.. ఏమీ లేదంటూ.. మహిళా సిబ్బంది, ఇతర సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో సిబ్బంది వెనక్కి వచ్చి ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్‌కు జరిగిన సంఘటనను వివరించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ దాడికి ప్రయత్నించిన లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
పోలీస్‌స్టేషన్‌లో
కమిషనర్ ఫిర్యాదు
మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నం
Comments
Please login to add a commentAdd a comment