దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment