టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్‌లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్‌కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment