ముగిసిన వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఎదుర్కోళ్లు, స్వామివారి కల్యాణం, చతురస్త్రార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు చతురస్త్రార్చన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రాతారాధన, సేవాకాలం, రాజభోగం, పూర్ణాహుతి, నవ కలశ స్నపన చక్రతీర్థం అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణ, అర్చకులు శ్రీకర్, శేషసాయి, రంగనాథ్, ప్రసాద్, నర్సింహచార్యులు, నవీన్, తివారీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వారం రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment