‘గుర్రంగడ్డ’ పనుల్లో కదలిక
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వ హయాంలో 2015లో రూ.12కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో గత ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారులు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో..
గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్‌లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు.
నూతన ఏజెన్సీకి
బ్రిడ్జి నిర్మాణ పనులు
కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం..
వంతెన నిర్మాణంతో
తీరనున్న కష్టాలు
ఏడాదిలో పనులు పూర్తి చేస్తాం
2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
– రహీముద్దీన్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment