‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటుతాం
కందనూలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, సహ రిటర్నింగ్ అధికారులు బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మొగిలి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి కోసం దొడ్ల రాజవర్ధన్‌రెడ్డి, వేముల నరేందర్‌రావు, రాఘవేందర్‌గౌడ్, పొల్దాస్ రాము, బల్మూరి జానకి తదితరులు నామినేషన్లు అందజేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మొగిలి దుర్గాప్రసాద్, మాయని శ్రీశైలం, మొక్తాల రేణయ్య, సందు రమేష్‌లను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ నియమాల ప్రకారం జిల్లా అధ్యక్షుడి ఎంపిక చేయడం కోసం నామినేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు. బీజేపీ జిల్లాలో సంస్థాగతంగా బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై త్వరలో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా
అధ్యక్షుడిగా నరేందర్‌రావు
సాక్షి, నాగర్‌కర్నూల్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్‌రావును పార్టీ అధిష్టానం సోమవారం నియమించింది. జిల్లాలోని ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన నరేందర్‌రావు హైదరాబాద్‌లో అడ్వకేట్‌గా పనిచేస్తూ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమించింది. ఇందులో నాగర్‌కర్నూల్ నుంచి మాయని శ్రీశైలం, అచ్చంపేట నుంచి ఎం.రేణయ్య, కల్వకుర్తి నుంచి దుర్గాప్రసాద్, కొల్లాపూర్ నుంచి సందు రమేష్‌లకు చోటు కల్పించినట్లు రాష్ట్ర రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment