‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
చారకొండ/ తిమ్మాజిపేట: వచ్చే వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం చారకొండ, జూపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్, తిమ్మాజిపేటలోని కేజీబీవీలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. బాలిక విద్య బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే కేజీబీవీల్లో బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో కాదు, మీ లక్ష్యం ఎంత గొప్పదో దాని కోసం ఎంత కృషి చేస్తున్నారో అదే నిజమైన విజయాన్ని నిర్దేశిస్తుందన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అంతకు ముందు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు నేర్చుకునే ఎఫ్‌ఎల్‌ఎన్, ఎక్సెల్‌ఎన్ కంప్యూటర్ ల్యాబ్‌ను డీఈఓ సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో చారకొండ ఎంఈఓ ఝాన్సీరాణి, ఏఎంఓ షర్ఫుద్దీన్, చారకొండ హెచ్‌ఎం భగవాన్‌రెడ్డి, తిమ్మాజిపేట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శోభారాణి, జిల్లా టెస్టుబుక్ మేనేజర్ నర్సింహ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment