మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈసారి బడ్జెట్‌లో పాలమూరు యూనివర్సిటీకి కేటాయింపులు పెరిగాయి. గతేడాది యూనివర్సిటీకి వేతనాల కోసం రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది రూ.200 కోట్లు అభివృద్ధి కోసం, రూ.66 కోట్లు వేతనాల కోసం ప్రతిపాదించారు. వేతనాల్లో కొత్తగా వస్తున్న ఇంజినీరింగ్, లా కళాశాలు, పీజీ కళాశాల సిబ్బంది వివరాలు కూడా ఉన్నారు. కాగా..ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం సిబ్బంది వేతనాల కోసం రూ.15.19 కోట్లు, అభివృద్ధి కోసం రూ.35 కోట్లును కేటాయించింది. మొత్తంగా పీయూకి రూ.50.19 కోట్లను కేటాయించారు. వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్పలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే అధికంగా నిధులు కేటాయించిందని, దీంతో యూనివర్సిటీ మరింత అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించారు. ప్రాజెక్టులకు సైతం కేటాయింపులు తగ్గించారు. ప్రాజెక్టులు పురోగతి సాధించే అవకాశం లేదు. ఆరు గ్యారంటీల అమలు కోసం కేటాయించిన నిధులలో ఏమాత్రం స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 30 లక్షల పైచిలుకు అర్హులు ఉంటే.. కేవలం 5 లక్షలకే సరిపడా నిధులు కేటాయించారు.
– వర్ధం పర్వతాలు, సీపీఎం జిల్లా కార్యదర్శి
ఎన్నికల హామీలను విస్మరించారు..


