దొరకని కార్మికుల ఆచూకీ
సంగమేశ్వరాలయంలో పూజలు ప్రారంభం
కొల్లాపూర్: కృష్ణానదిలోని సప్తనదుల సంగమ స్థానంలో వెలసిన సంగమేశ్వరాలయంలో ఆదివారం నుంచి సాధారణ పూజలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఆలయం మొత్తం నది నీటి నుంచి బయటపడిన విషయం తెలిసిందే. గత మూడురోజులుగా ఆలయంలో మట్టి, బురద తొలగింపు పనులను భక్తులు చేపట్టారు. ఆలయ శుభ్రత పనులు పూర్తికావడంతో సంగమేశ్వరుడి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయ అర్చకులు రఘురామశర్మ పూజలు నిర్వహించారు. ఇక నుంచి ప్రతిరోజు ఆలయంలో పూజలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
సిర్సనగండ్లలో
రేపు వేలం పాట
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొబ్బరికాయలు, కొబ్బరి ముక్కలు, తలనీలాలకు మంగళవారం స్వామివారి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు కొబ్బరికాయలకు రూ.5 లక్షలు, తలనీలాలకు రూ.లక్ష, కొబ్బరి ముక్కలకు రూ.50 వేల చొప్పున డిపాజిట్ చెల్లించాలని, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వేలం దక్కించుకున్న వారు వెంటనే 75 శాతం డబ్బులు చెల్లించి.. మిగతా డబ్బులు డబ్బులు రెండు రోజుల్లో చెల్లించాలని పేర్కొన్నారు.
వివరాలు 8లో u
ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆటంకాలు సృష్టిస్తున్న
ఊటనీరు, బురద మట్టి
డీ1, డీ2 ప్రదేశాల్లో
ఆచితూచి తవ్వకాలు
అధికారులకు సవాల్‌గా మారిన ప్రమాదం – అచ్చంపేట


