ఎల్‌ఆర్‌ఎస్‌తో కూడిన రిజిస్ట్రేషన్లు 500ల్లోపే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 406 దస్తావేజులకు ఎల్‌ఆర్‌ఎస్‌తో కూడిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహబూబ్‌నగర్‌లో 30, జడ్చర్లలో 42, వనపర్తిలో 107, ఆత్మకూర్‌లో 8, గద్వాలలో 59, అలంపూర్‌లో 14, నారాయణపేటలో 17, మక్తల్‌లో 4, నాగర్‌కర్నూల్‌లో 26, అచ్చంపేటలో 3, కల్వకుర్తిలో 71, కొల్లాపూర్‌లో 25 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌తో కూడిన రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలు ఈ నెల 19వ తేదీ వరకు కాగా.. ఇప్పటి వరకు మరో సుమారు 80 దస్తావేజుల వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్‌డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మక్కై వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.
రూ.6 కోట్ల వరకు నష్టం.. విచారణకు సన్నద్ధం
ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో సమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు అంచనా. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ఐదు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో అధికారులు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని చెబుతున్నా.. గతంలోనే రిజిస్ట్రేషన్లు పూర్తికావడంతో తలనొప్పులు ఎందుకని భావించి మౌనం వహిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొచ్చినా.. 25 శాతం రాయితీ కల్పించినా.. ప్రజలు ముందుకు రాకపోవడం, సరైన ఆదాయం సమకూరకపోవడం.. జీపీ లేఅవుట్ల అక్రమ రిజిస్ట్రేషన్లతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు సన్నద్ధమవుతుండగా.. అక్రమార్కుల్లో భయం నెలకొంది.
సామాన్యులపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్‌రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్‌పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు.
– మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
నత్తనడకన ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ
25 శాతం రాయితీ ఇచ్చినా ముందుకు రాని దరఖాస్తుదారులు
పలు అనధికార జీపీ లేఅవుట్లకు ఇది వరకే రిజిస్ట్రేషన్లు
అప్పటి సబ్‌రిజిస్ట్రార్లకు కాసుల పంట పండినట్లు అనుమానాలు
తాజాగా తూతూమంత్రంగా
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
సర్కారు ఆదాయానికి భారీగా గండి.. పూర్తిస్థాయిలో విచారణకు సన్నద్ధం
ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం..
ఎల్‌ఆర్‌ఎస్‌పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్‌తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.
– వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
డామిట్.. కథ అడ్డం తిరిగింది!


