నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని బార్ అసోసియేషన్ కార్యదర్శి పర్వత్‌రెడ్డి అన్నారు. చంపాపేట్‌లో కోర్టుకు వెళ్తున్న న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తిలో భాగంగా కేసులను వాదిస్తుంటారని కేసుల్లో ఓడిపోయిన కొందరు కక్షపూరితంగా న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాబుపియర్స్, శ్రీనివాసులు గుప్తా, శ్యాంప్రసాద్‌రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


