ఉపాధ్యాయ గొంతుకగా గెలిపించండి
మిర్యాలగూడ : ఉపాధ్యాయ గొంతుకగా తనను మరోసారి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మిర్యాలగూడలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఆయన ఓటు అభ్యర్థించారు. అనంతరం యూటీఎఫ్ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 30శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ సాధనలో కృషి చేశానని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ పీఆర్‌సీ ప్రకారం 30శాతం వేతనాలు పెంచడానికి, ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేయించానని, ఇలా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. సీపీఎస్ రద్దు చేయించి ఓపీఎస్ అమలయ్యేలా కృషి చేస్తానని, జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు అమలు, డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు, 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారికి పీఎఫ్, హెల్త్ స్కీం, రిటైర్‌మెంట్ సందర్భంలో ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అర్హులైన వారికి ప్రభుత్వ గృహ నిర్మాణంలో అవకాశం కల్పించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగమణి, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, ఎ.కరుణాకర్‌రెడ్డి, మోర్తాల శ్రీనివాస్‌రెడ్డి, చిన్న వెంకన్న, గుండా వేదశ్రీ, దాసరి ప్రభాకర్, బైరం బాలరాజు, మాళోతు నాగేష్‌నాయక్, కోడిరెక్క జయరాజు, సాజిద్‌అలీ, పులి సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment