నమో నారసింహ
భక్తులకు ఉచిత ప్రసాదం
మహోత్సవానికి ఎంత మంది భక్తులు వచ్చిన ఉచితంగా పంపిణీ చేసేందుకు పులిహోర తయారు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక శ్రీస్వామి వారి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ, మహా కుంభాభిషేకాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా కొండపైన మాడ వీధుల్లో, కొండ కింద కమాన్ వద్ద, వ్రత మండపం వద్ద, ఇతర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విమాన గోపురానికి బంగారం తాపడానికి సహకరించిన దాతలు కూర్చోడానికి కొండపైన, తూర్పు మాడ వీధిలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఈఓతో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు.
నేడు యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
ఆలయ ఉత్తర మాఢ వీధిలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్.
బంగారు కలశాల బిగింపు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అష్టభుజి ప్రాకార మండపాలపై బంగారు కలశాలను శిల్పులు బిగించారు. గతంలో అష్టభుజి ప్రాకార మండపాలపై ఉన్న విమానాలతో పాటు వైకుంఠద్వారానికి రాగితో తయారు చేసిన కలశాలు ఏర్పాటు చేశారు. వీటి స్థానంలో ఇటీవల తయారు చేయించిన బంగారు కలశాలు బిగిస్తున్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో బంగారు కలశాలను బిగించారు.
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి క్షేత్రం స్వర్ణకాంతులతో కనువిందు చేయనుంది. బంగారు తాపడంతో రూపుదిద్దుకున్న దివ్య విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అడుగడుగునా స్వామి, అమ్మవారి చిత్రాలు, భారీ స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణతో ప్రధానాలయంతో పాటు ఆలయ పరిసరాలు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
భక్తిభావం పెంపొందించేలా ఏర్పాట్లు
మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం ప్రపంచమంతా తెలిసేలా దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. భక్తిభావం మరింత పెంపొందించేలా, ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టణంలో నిత్యం శ్రీస్వామి వారి కీర్తనలు వినిపించేలా మైక్‌లు ఏర్పాటు చేశారు. బస్టాండ్ నుంచి రింగ్ రోడ్డు, కొండపైన ఎటు చూసిన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా దేవతామూర్తుల చిత్రాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, కొండ కింద పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో ఆలయాన్ని తీర్చిదిద్దారు.
వాహనాలకు నో ఎంట్రీ
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వచ్చి వెళ్లే వరకు కొండపైకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కొండ కింద పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలని సూచించారు. ఉదయం నుంచి 25 బస్సులు నిత్యం కొండపైకి నడుస్తాయని అధికారులు వెల్లడించారు. విమాన గోపురం వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు, అర్చకులు వెళ్లేందుకు మెట్లతో కూడిన ప్రత్యేక నిచ్చెన ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు యాదగిరిగుట్టలోని హెలిపాడ్ వద్ద దిగుతారు.
హెలిపాడ్ నుంచి నేరుగా యాదగిరి కొండపైన గల అతిథిగృహానికి చేరుకుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి 11.25 గంటలకు యగశాలకు చేరుకుని మహా పూర్ణాహుతిలో పాల్గొంటారు.
12.15కు ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరిస్తారు.
12.45కు స్వయంభూలను దర్శించుకుంటారు.
12.50 నుంచి 1.30 వరకు అతిథిగృహంలో ఉంటారు. అక్కడ భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
ఫ నేడు స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
ఫ ముఖ్య అతిథిగా హాజరుకానున్నసీఎం రేవంత్‌రెడ్డి
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
ఫ కాంతులీనుతున్న ప్రధానాలయం
నమో నారసింహ
Comments
Please login to add a commentAdd a comment