
ఎండోస్కోపిక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
బీబీనగర్: వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న రోగులు ఎయిమ్స్ వైద్య కళాశాలలోని అందిస్తున్న అత్యాధునిక సర్జరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, స్పైన్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఇఫ్తేకర్ కోరారు. ఎయిమ్స్‌లోని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా వారు శుక్రవారం దీనిని సంబంధించిన వివరాలు వెల్లడించారు. రోగులు త్వరగా కోలుకునే విధంగా వెన్నెముక శస్త్ర చికిత్సలో కొత్త శకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి ఎండోస్కోప్ సాయంతో చిన్నకోతల ద్వారా సర్జరీ చేయొచ్చని తెలిపారు.